CERT-In లేదా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ Apple ఉత్పత్తులకు హెచ్చరిక జారీ చేసింది. ఈ సమస్యకు ఏజెన్సీ 'అధిక' తీవ్రత రేటింగ్ ఇచ్చింది. Apple ఉత్పత్తులలో "రిమోట్ కోడ్ అమలు దుర్బలత్వాన్ని" ప్రభుత్వ యంత్రాంగం కనుగొంది. ఇది పరికరంలో రిమోట్‌గా యాక్సెస్‌ను పొందగల, టార్గెటెడ్ సిస్టమ్‌లో ఏకపక్ష కోడ్ ని అమలు చేసే హ్యాకర్ ద్వారా దోపిడీకి గురయ్యి పరికరాన్ని నాశనం చేయగలదు.
CERT) హెచ్చరిక ప్రకారం.. : ఆపిల్ iOS, ఐప్యాడ్ OSలో భద్రతపరమైన సమస్యలకు అందులోని బ్లూటూత్, libxpc, MediaRemote, Photos, Safari & WebKit పార్టులలో ధృవీకరించని కారణంగానే సంభవించాయి. ExtensionKit, Messages, Share Sheet, Synapse & Notes భాగాలలో కూడా ప్రైవసీ పరమైన సమస్యలు ఉన్నాయి. మరొక సమస్య ఏమిటంటే.. (ImagelO) అనేది కూడా ఫుల్ లోడ్ అయింది. కెర్నల్ & (RTKit) భాగాలు మెమరీలో కూడా సమస్యలు ఉండవచ్చు. సఫారీ ప్రైవేట్ బ్రౌజింగ్ అండ్ శాండ్‌బాక్స్‌లో కూడా సమస్య ఉంది.
మీ డివైజ్‌లను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే..
సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం
సెక్యూరిటీ ప్యాచ్ లను ఇన్ స్టాల్ చేయడం
సేఫ్ కనెక్షన్స్ ను మాత్రమే వాడడం
టూ- ఫ్యాక్టర్డ్ అథెంటిఫికేషన్ కలిగి ఉండడం
డేటా బ్యాకప్ చేయడం
డౌన్ లోడ్ లతో జాగ్రత్తగా ఉండడం