US New Tariffs : భారత్ కు మరో దెబ్బ .. ఫార్మారంగంపై అమెరికా సుంకాలు

Update: 2025-04-10 06:45 GMT

అమెరికా ప్రతీకార సుంకాలతో ఇప్పటికే ఇబ్బంది పడుతోన్న భారత్ కు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరో పిడుగులాంటి వార్త వినిపించారు. ఫార్మా దిగుమతులపై త్వరలో నే సుంకాలు విధిస్తామని తాజాగా ప్రకటించారు. ఆయన చేసిన ఈ ప్రకటన నిజంగా భారత ఫార్మా రంగంపై భారీగా ప్రభావం చూపనుంది. ఎందుకంటే యూఎస్... మన 97. ఫార్మా ఎగుమతులకు అతి పెద్ద మార్కెట్ గా 10 ఉంది. 2024 వార్షిక సంవత్సరంలో మన దేశం 27.9బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఎగుమతులు చేయగా, వాటిలో 31శాతం (8.7బిలియన్ డాలర్లు) యూఎస్ కు ఎగుమత చేసినవేనని ఫార్మాసూటికల్స్ ఎక్స్ ఫోర్ట్ ప్రమో షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి. అమెరికాలో వినియోగించే 45శాతం జెనరిక్, 15శాతం బయో సిమిలర్ డ్రగ్స్ ఇండియా నుంచి సరఫరా అయ్యేవే. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్ సైన్సెస్, సన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా లాంటి సంస్థల ఆదాయాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు అమెరికా మార్కెట్ నుంచే వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఫార్మారంగంపై సుంకాలు విధిస్తే ఆ ప్రభావం రెండు దేశాలపై ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News