Montana Airport : ఆగి ఉన్న విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం!

Update: 2025-08-12 12:00 GMT

విమానాశ్రయంలో పార్క్‌ చేసిన విమానంపైకి చిన్న విమానం దూసుకెళ్లిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. రన్‌వేపై టేకాఫ్ కోసం సిద్ధమవుతున్న ఒక చిన్న విమానం, అప్పటికే పార్కింగ్ ఏరియాలో ఉన్న మరో చిన్న విమానంపైకి దూసుకెళ్లింది. టేకాఫ్ కోసం రన్‌వేపై వేగంగా వెళ్తున్న విమానం అకస్మాత్తుగా అదుపుతప్పింది. ఆ విమానం గాలిలోకి లేవకుండానే వేరే దిశగా దూసుకెళ్లి, పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ ఆగి ఉన్న మరో విమానంపైకి ఎక్కింది. ఈ ఘటనలో రెండు విమానాలు కూడా దెబ్బతిన్నాయి. ఒక విమానం రెక్క విరిగిపోయింది, మరో విమానం ప్రొపెల్లర్ మరియు ఇంజిన్ బాగా దెబ్బతిన్నాయి.అమెరికాలోని మోంటానా ఎయిర్‌పోర్టులో ఈ ఘటనతో భారీగా మంటలు వ్యాపించాయి.. ప్రమాదం జరిగినప్పుడు రెండు విమానాల్లో పైలట్లు మాత్రమే ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం పైలట్ తప్పిదం అని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) విచారణ ప్రారంభించింది. టేకాఫ్ సమయంలో పైలట్ చేసిన తప్పిదంపై పూర్తి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. సాధారణంగా ఎయిర్‌పోర్టులో ఇటువంటి ప్రమాదాలు జరగడం చాలా అరుదు. అయితే, మానవ తప్పిదాల వల్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

Tags:    

Similar News