Apple Retail Store In India: భారత్ పై అపార నమ్మకంతోనే...

త్వరలోనే భారత్ యాపిల్ రిటైల్ స్టోర్; సీఈఓ టిమ్ కుక్ ప్రకటన

Update: 2023-02-03 11:31 GMT

భారత్ పై అపారమైన నమ్మకం ఉందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్  అన్నారు. అందుకే త్వరలోనే భారత్ లో యాపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. 2023 తొలి క్వార్టర్ డిసెంబర్ 2022తో ముగియడంతో టిమ్ కుక్ సంస్థ ఆర్థిక ఫలితాలు వెల్లడించారు. గతేడాదితో పోల్చుకుంటే యాపిల్ క్వార్టర్లీ రెవెన్యూ 5శాతం మేర పడిపోయిందని తెలిపారు. అయితే భారత్ లో మాత్రం రాబడి ఆశాజనకంగా ఉందని తెలిపారు. ఈ నమ్మకంతోనే భారత్ లో యాపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఐ- ఫోన్ లు భారీ మొత్తంలో అమ్మడయ్యాయని చెప్పారు. ఈ అమ్మకాల్లో యాపిల్ ఆన్ లైన్ స్టోర్ లు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఐ -పాడ్, మాక్ వంటి ఉత్పత్తులకు కూడా ఇక్కడ విపరీతమైన డిమాండ్ నెలకొందని వెల్లడించారు. అందుకే భారత్ లో త్వరలోనే రిటైల్ స్టోర్ ప్రారంభించాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీని వల్ల దేశంలో తమ వ్యాపారం బలపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆ నమ్మకంతోనే తమ పెట్టుబడులతో పాటూ, అపారమైన శక్తి సామర్థ్యాలను ఇక్కడ ఉపయోగించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ అత్యంత ఆసక్తికరమైన మార్కెట్ అని  టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News