ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీదీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar ) హత్య జరిగిన సంవత్సరమైన సందర్భంగా కెనడా పార్లమెంట్లో సంతాప కార్యక్రమం జరిగింది. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిపై కెనడాకు ఘాటు సందేశం పంపించింది.
దీనిపై వాంకోవర్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందించింది. ఉగ్రవాద సమస్యను ఎదుర్కోవడంలో భారత్ ముందువరసలో ఉందని, ఈ విషయంలో ఇతర దేశాలతో కలిసి పని చేస్తోందని తెలిపింది.
ఎయిర్ ఇండియా విమానం కనిష్కను గాల్లో పేల్చివేసి జూన్ 23, 2024 నాటికి 39 సంవత్సరాలు అవుతాయని తెలిపింది. ఉగ్రవాదుల పిరికిపంద చర్యలో 329 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 86 మంది చిన్నారులు ఉన్నారు.
విమానయాన చరిత్ర లో అత్యంత ఘోరమైన దుర్ఘటన ఇదని పేర్కొంది. ఆ రోజున వాంకవర్ లోని స్టాన్లీపార్క్ వద్ద సెపెర్లీ ప్లే గ్రౌండ్ లో మెమోరియల్ వద్ద సంతాప కార్యక్రమం ఏర్పాటు చేసింది.