Bangladesh : బంగ్లాలో హిందువులపై దాడి

Update: 2024-08-06 10:21 GMT

​బంగ్లాదేశ్‌లో ప్రధాని రాజీనామా, దేశం వీడిన తర్వాత హిందూ వ్యతిరేక హింస కొనసాగుతోంది. ఢాకాలోని ఖిల్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూ దేవాలయాలు, ఇళ్లపై దాడులు జరిగాయి. ఛాందసవాదులు ఇళ్లను ధ్వంసం చేసి దోచుకున్నారు. కొన్ని చోట్ల, దేవాలయాల భద్రత కోసం విద్యార్థులను మోహరిస్తున్నారు. నిన్నటి రాత్రి నుంచే ఆలయాలకు కాపలాగా ఉంటున్నారు. ఇస్కాన్ టెంపుల్, దుర్గామాత టెంపుల్ పై రాడికల్స్ దాడులకు తెగబడ్డారు. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ హిందూ దేవాలయాలు, ఇళ్లు, సంస్థలపై జరిగిన దాడుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం ఐదు గంటల్లోనే హిందువులపై 54 చోట్ల దాడులు జరిగాయి. హిందువుల ఇళ్లపై దాడి చేయడం, ధ్వంసం చేయడం, దోచుకోవడం కొనసాగుతున్నది.

Tags:    

Similar News