బంగ్లాదేశ్‌లో డెంగ్యూ వ్యాప్తి.. 1000 మందికి పైగా మృతి
ఈ ఏడాది బంగ్లాదేశ్ లో దాదాపు 209,000 మంది డెంగ్యూ వ్యాధి బారిన పడ్డారు.;
ఈ ఏడాది బంగ్లాదేశ్ లో దాదాపు 209,000 మంది డెంగ్యూ వ్యాధి బారిన పడ్డారు. దాదాపు 1,000 మందికి పైగా డెంగ్యూ జ్వరంతో మరణించినట్లు అల్ జజీరా నివేదించింది. గత ఏడాది తో పోలిస్తే మరణాల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ.
మరణించిన వారిలో 15 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న 112 మంది పిల్లలు ఉన్నారు., శిశువులతో సహా డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
జనసాంద్రత అధికంగా ఉన్న దక్షిణాసియా దేశంలో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తున్నందున దేశంలోని ఆసుపత్రులు రోగులకు బెడ్స్ కల్పించడంలో ఇబ్బంది పడుతున్నాయి.
డెంగ్యూ ఉష్ణమండల ప్రాంతాలకు సంబంధించిన వ్యాధి. అధిక జ్వరాలు, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల నొప్పి, అత్యంత తీవ్రమైన సందర్భాల్లో రక్తస్రావం మరణానికి దారి తీస్తుంది.
వాతావరణ మార్పుల కారణంగా చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్, జికా వంటి దోమల వల్ల వచ్చే వైరస్‌ల వల్ల డెంగ్యూ, ఇతర వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది.
డెంగ్యూ నివారణకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ లేదు. ఇది వర్షాకాలంలో దక్షిణాసియాలో సర్వసాధారణంగా ఉంటుంది. నిల్వ ఉన్న నీటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది.
బంగ్లాదేశ్‌లో 1960ల నుండి డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి.