Bangladesh MP : బంగ్లాదేశ్ ఎంపీని హనీ ట్రాప్ చేసింది ఈమెనే!

Update: 2024-05-25 06:36 GMT

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆయన హత్యలో బంగ్లా మోడల్ శిలాస్తి రెహమాన్ కీలక పాత్ర పోషించారు. ఎంపీని అపార్ట్‌మెంట్‌కు రప్పించేందుకు హనీ ట్రాప్ చేశారు. ఇంట్లోకి రాగానే గొంతు నులిమి చంపి.. చర్మాన్ని ఒలిచారు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. ఆ ముక్కలకు పసుపు పూసి సూట్‌కేసులో కుక్కి కోల్‌కతాలోని పలు చెరువుల్లో విసిరేశారు. శిలాస్తిని ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు.

బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ ట్రీట్​మెంట్ కోసం మే 12న బెంగాల్​కు వచ్చారు. బారానగర్​లోని తన స్నేహితుడు గోపాల్ బిశ్వాస్ ఇంట్లో దిగారు. 13న ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆయన తిరిగిరాలేదు. సెర్చింగ్ ప్రారంభించిన పోలీసులు ఎంపీ హనీ ట్రాప్​కు గురైనట్లు నిర్ధారించారు. ఓ మహిళ సహా మరో ఇద్దరితో కలిసి ఆయన కోల్​కతా శివారులోని ఖాళీగా ఉన్న తన స్నేహితుడి అపార్ట్​మెంట్​లోకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు

Tags:    

Similar News