లండన్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు
లండన్‌లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి దగ్గర... తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు..;
లండన్‌లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి దగ్గర... తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత స్పూర్తితో బతుకమ్మ కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో... కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మహిళలు బతుకమ్మలు ఆడారు. ప్రతి సంవత్సరం వందల మంది ఆడబిడ్డలతో ఈ పండుగ జరుపుకుంటామని... ఈ సారి మాత్రం కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే వేడుకలు జరిపామని... టాక్ సంస్థ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం తెలిపారు. మన సంస్కృతిని మరచిపోకుండా.. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ ఆడిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది కృతజ్ఞతలు తెలిపారు.