Bhutan PM : మోదీ నా పెద్దన్న .. ఆయన్నుంచి లీడర్షిప్ నేర్చుకున్నా : భూటాన్ ప్రధాని
భారత ప్రధాని మోదీ తనకు పెద్దన్న వంటి వారని, ఆయన్నుంచి నాయకత్వ పాఠాలు నేర్చుకొనే అవకాశం తనకు దొరికిందని భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్గే అన్నారు. ప్రస్తుతం ప్రపంచదేశాలు ఇండియా వైపు చూస్తున్నా యని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన 'సోల్' లీడ ర్షిప్ కాన్ క్లేవ్ తోన్గే మాట్లాడారు. 'ప్రస్తుతం భారత్ పర్యటనకు ఓ విద్యార్థిగా వచ్చా. ప్రధాని మోదీ విజ్ఞత, ధైర్యం, ముందుచూపుతో కేవలం పదేళ్లలో భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించారు. లీడర్షిప్ అనేది కేవలం బిరుదుల్లో ఉండదు. వారు చూసే దృష్టికోణంలో ఉంటుంది.ప్రపంచంలో గొప్ప నాయకులుగా పేరుపొందిన వారు కేవలం ఒక సంస్థకు లేదా దేశానికి మాత్రమే నా యకత్వం వహించలేదు. సరైన లీడర్లు తమ దేశాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లగలరు' అని అన్నారు.