అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల తన కుమారుడికి క్షమాభిక్ష ప్రకటించి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో 39 మందికి క్షమాభిక్ష ప్రకటించారు. అలాగే, 1500 మంది ఖైదీలకు శిక్షాకాలం తగ్గించారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఒకరోజులో ఇంతమందికి క్షమాభిక్ష ప్రకటించడం ఇది తొలిసారి అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. బైడెన్ పదవీకాలం జనవరి 20తో ముగియనుంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ట్రంప్ ఆహ్వానం పంపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. కాగా, తనకు ట్రంప్ నుంచి ఆహ్వానం అందినా ప్రమాణస్వీకారానికి వెళ్లేందుకు జిన్‌పింగ్ సుముఖంగా లేరని ఆ దేశ మీడియా పేర్కొంది. అమెరికాకు చైనా అంబాసిడర్, అతని భార్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారని తెలిపింది