White House : భారత్కు బైడెన్ .. -క్వాడ్ సదస్సుకు హాజరవుతారన్న వైట్ హౌస్
భారత్లో జరగనున్న క్వాడ్ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరవుతారని వైట్ హౌస్ తెలిపింది. జనవరిలోనే సదస్సు జరగాల్సివున్నా అమెరికా విజ్ఞప్తితో భారత్ పోస్ట్ పోన్ చేసింది. అయితే అమెరికా ఎన్నికల నేపథ్యంలో బైడెన్ హాజరుపై అనుమానాలు నెలకొన్న వేళ వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ‘ క్వాడ్ సదస్సుకు హాజరయ్యేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో బైడెన్ షెడ్యూల్లో కొన్ని ఖాళీలు ఉన్నాయి. దీంతో విదేశాంగ విధానం, భద్రతపై బైడెన్ మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉంది’ అని వైట్ హౌస్ తెలిపింది. కాగా 2020 నుంచి క్వాడ్ సమావేశాలు వర్చువల్గా జరుగుతున్నాయి.