గ్రీస్ లో పడవ ప్రమాదం..79 మంది మృతి
గ్రీస్దగ్గరలోని మెస్సెనియా పైలోస్తీరంలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 79 మంది మృతి చెందగా, 500 మందికి పైగా గల్లంతు అయ్యారు.;
గ్రీస్దగ్గరలోని మెస్సెనియా పైలోస్తీరంలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 79 మంది మృతి చెందగా, 500 మందికి పైగా గల్లంతు అయ్యారు. ప్రమాద సమయంలో 15 మంది సిబ్బందితో పాటు 700 మంది శరణార్థులు ప్రయాణిస్తున్నారు. ఇందులో 300 మందికి పైగా పాకిస్థానీలు మిస్ అయినట్లు సమాచారం. పడవ ప్రమాదంలో మృతి చెందిన వారికి పాక్ ప్రభుత్వం సంతాపం తెలిపింది. ఈ ఘటనపై హైలెవల్ కమిటీ వేసిన పాకిస్థాన్ 10 మంది సబ్ఏజెంట్లను అరెస్ట్‌చేసింది.
ఇక పడవలో చాలా మంది ప్రయాణిస్తున్నారని మూడో రోజు అకస్మాత్తుగా పడవలోకి నీళ్లు రావడంతో ప్రయాణికులంతా కంగారుపడి రెండో వైపుకు రావడంతో క్షణాల్లో పడవ నీట మునిగింది. గ్రీస్ కోస్ట్ గార్డ్ బృందం వచ్చి కొందరిని రక్షించారు.డ్రోన్లు, బోట్ల సాయంతో గల్లంతైన వారి కోసం వెతుకుతున్నట్లు గ్రీస్ కోస్ట్అధికారులు తెలిపారు.
మరోవైపు మధ్యధర సముద్రంలో వందల సంఖ్యలో పౌరుల మరణానికి దారి తీసిన గ్రీస్ పడవ దుర్ఘటన వెనక ఉన్న మానవ అక్రమ రవాణాదారులను గుర్తించేందుకు పాక్ ప్రధాని ఉన్నత స్థాయి కమిటీ వేశారు. ఈ కమిటీ ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. ఇప్పటికే ఇందుకు కారణమైన 10 మంది సబ్ఏజెంట్లను పాక్‌లోని పలు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. పడవ ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపంగా పాక్‌లో జాతీయ జెండాను అవతనం చేశారు.