Britain : యువరాజుపై వివక్ష నిజమేనట..!

ప్రిన్స్ హ్యారీపై వివక్ష నిజమేనంటూ స్టేట్మెంట్ ఇచ్చిన డయానా సహాయకుడు; తిండి కూడా సరిగ్గా పెట్టేవారు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు...;

Update: 2023-01-16 10:59 GMT



బ్రిటన్ రెండో యువరాజు హ్యారీ రాసిన 'స్పేర్' పుస్తకం (స్వీయ చరిత్ర ) పలు ఆసక్తికర విషయాలను తట్టిలేపుతుంది. ఈ పుస్తకం ఆధారంగా, హ్యారీ చిన్నతనంలో ఎదుర్కొన్న అవమానాలపై చర్చ నడుస్తుంది. తాజాగా.. హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానా దగ్గర పనిచేసిన బట్లర్ పాల్ బరేల్, హ్యారీ రాసిన పుస్తకంపై తన అభిప్రాయాలను, అనుభవాలను వ్యక్త పరిచాడు. హ్యారీని చిన్నప్పటినుంచి విలియమ్స్ తో సమానంగా రాజకుటుంబం చూసేది కాదని పాల్ తెలిపాడు. భోజనం దగ్గర కూడా విలియమ్స్ కు పెట్టినంత భోజనం హ్యరీకి ఉండేది కాదని ఆయన చెప్పాడు.

చాలా సార్లు హ్యారీ తనకు భోజనం తక్కువగా ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించేవాడని అన్నారు పాల్. ఇంట్లో పనిచేసే వారుకూడా విలియమ్స్ ఎప్పటికైనా రాజవుతాడని హ్యారీ తనను అనుసరించడం తప్ప వేరే దారి లేదన్నట్లుగా మాట్లాడేవారని పాల్ చెప్పారు. రాజ భవనం మొత్తం హ్యారీకి తగినంత గౌరవం ఇవ్వలేదని పేర్కొన్నారు.

రాజకుటుంబం నిర్ధేశించనట్లు విలియమ్స్ నడుచుకునేవాడని అలాంటి ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవడం హ్యారీకి కష్టమని పాల్ అభిప్రాయపడ్డాడు. రాజకుటుంబంలో హ్యారీని 'స్పేర్' లా చూసిన మాట నిజమేనని తెలిపారు పాల్. ఇప్పటికీ, అతను స్పేర్ కావడం పట్ల బాధపడుతున్నాడని అందుకే హ్యారీ రాసిన పుస్తకానికి కూడా 'స్పేర్' అని పేరు పెట్టుకున్నట్లు పాల్ అభిప్రాయపడ్డాడు. హ్యారీ రాజకుటుంబంలోని ఒత్తిడులను భరించలేక ఒక సారి డ్రగ్స్ తీసుకున్నాడని... విషయం తెలిసిన ప్రిన్సెస్ డయానా ఆందోళన చెందారని తెలిపాడు పాల్.

ప్లోరిడాలో మాట్లాడిన పాల్... రాజకుటుంబంపై హ్యారీ దాడులు భవిష్యత్తులో మరింత ఉధృతం కానున్నాయని అభిప్రాయపడ్డాడు. 2003లో బట్లర్ పాల్, రాసిన 'ఎ రాయల్ డ్యూటీ' అనే పుస్తకంలో రాజకుటుంబం గురించి పలు విషయాలు ప్రస్తావించినప్పటికి, హ్యరీ రాసిన 'స్పేర్' పుస్తకం రిలీజ్ అవడంతో తనలో నిక్షిప్తమైన అభిప్రాయాలను, నిజాలను బయటపెట్టినట్లుగా తెలిపాడు.

Tags:    

Similar News