Canada: కెనడా బయట జన్మించిన కెనడియన్ల పిల్లలకు పౌరసత్వం

కెనడా పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పులు

Update: 2025-12-17 02:00 GMT

కెనడా తన పౌరసత్వ నిబంధనల్లో మార్పులు చేసింది. తమ దేశ పౌరులకు కెనడా వెలుపల జన్మించిన బిడ్డలకు పౌరసత్వం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు బిల్‌ సీ-3ను అమలులోకి తెచ్చింది. ఈ నెల 15కు ముందు జన్మించిన లేదా పాత నిబంధనల వల్ల పౌరసత్వం లభించని వారు ఇప్పుడు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

అయితే తల్లిదండ్రులు కచ్చితంగా మూడేండ్లు (1095 రోజులు) కెనడాలో నివసించి ఉండాలన్న నిబంధన విధించింది. ఈ నిబంధన సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సంస్కరణతో భారతీయ కుటుంబాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరవచ్చని భావిస్తున్నారు.

కెనడాలో 2009 నుంచి అమల్లో ఉన్న మొదటి తరం పరిమితి ప్రకారం కెనడా వెలుపల జన్మించిన లేదా దత్తత తీసుకున్న పిల్లల తల్లిదండ్రుల్లో ఒక్కరైనా కెనడాలో పుట్టడమో లేక మరణించడమో జరిగి ఉండాలి. రెండేండ్ల క్రితం ఆంటారియో న్యాయస్థానం ఈ నిబంధనను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. దీనిని అంగీకరించిన కెనడా ప్రభుత్వం బిల్‌ సీ-3 పేరుతో పౌరసత్వ నిబంధనల్లో మార్పులు చేసింది.

తాజా మార్పు వల్ల ఎంతోమంది పౌరులకు ప్రయోజనం చేకూరనున్నట్లు అంచనా. కెనడాలో 2009 నుంచి ఇటీవలి వరకు అమల్లో ఉన్న మొదటి తరం పరిమితి ప్రకారం.. కెనడా వెలుపల జన్మించిన లేదా దత్తత తీసుకున్న పిల్లల తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా కెనడాలో పుట్టడమో, కన్నుమూయడమో జరిగి ఉండాలి. దీని కారణంగా చాలామంది పౌరసత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 2023లో ఆంటారియో న్యాయస్థానం ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పింది. దీనిపై ప్రభుత్వం కూడా అంగీకరించి అప్పీలుకు వెళ్లలేదు. అనంతరం బిల్‌ సీ-3 పేరుతో కెనడా పౌరసత్వ నిబంధనల్లో మార్పులు చేసింది.

Tags:    

Similar News