అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్‌స్టా పోస్ట్ వైరలవుతోంది. కెనడా పీఎంగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో ‘ఓహ్ కెనడా’ అంటూ ఓ మ్యాప్‌ను షేర్ చేశారు. ఇది అమెరికాలో కెనడా విలీనం అయినట్లు ఉంది. కెనడా విస్తీర్ణం 99.84 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా, USAది 98.33 లక్షలు. ఈ రెండు కలిస్తే 1.98 కోట్ల చ.కి.మీల విస్తీర్ణంతో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్దదిగా మారనుంది. ప్రస్తుతం రష్యా విస్తీర్ణంలో అతిపెద్దది.
కెనడాలో మెజారిటీ ప్రజలకు 51వ రాష్ట్రంగా అమెరికాలో విలీనం కావడం ఇష్టమే. ఆ దేశంతో భారీ వాణిజ్యలోటును, ఇస్తున్న రాయితీలను అమెరికా ఇక ఎంతోకాలం భరించలేదని జస్టిన్ ట్రూడోకు తెలుసు కాబట్టే, రాజీనామా చేశారు. అమెరికాలో విలీనమైతే ఈ సుంకాలు, అధిక పన్నులు ఉండవు. నిరంతరం చుట్టుముట్టి ఉండే రష్యా, చైనా నౌకల ముప్పు నుంచి సురక్షితంగా ఉండవచ్చు’’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు కెనడా వైపు నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు.