China: విషప్రయోగం చేసిన టీచర్ కు మరణ శిక్ష
25 మంది పిల్లలకు విషపు సూప్, ఒకరు మృతి;
25 మంది పిల్లలకు విషమిచ్చిన టీచర్‌కు చైనా కోర్టు మరణశిక్ష విధించింది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ దారుణ ఘటలో ఆ ఉపాధ్యాయురాలికి కోర్టు ఉరి శిక్ష విధించి దాన్ని అమలు చేసింది. విద్యార్దులకు విషం పెట్టినందుకు కోర్టు 39 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలికి కోర్టు మరణశిక్ష విధించి అమలు చేసింది. తోటి టీచర్ తో గొడవ పెట్టుకుని పిల్లలు తినే ఆహారంలో ఓ కిండర్‌గార్టెన్ టీచర్ కొన్ని రసాయనాలు కలిపింది. దీంతో మధ్యాహ్నాం భోజనాలు చేసిన తరువాత విద్యార్ధులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. అలా మొత్తం 25మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ఓ విద్యార్ది ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి పాల్పడిన టీచర్ కు హెనన్ ప్రావిన్స్ జియావోజువో నగరంలోని నం.1 ఇంటర్మీడియట్ కోర్టు జులై 14, శుక్రవారం మరణశిక్ష విధించి అమలు పరిచింది.
జియావోజువోలోని మెంగ్‌మెంగ్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ కు చెందని స్కూల్లో వాంగ్ యున్ అనే 39 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు తోటి ఉపాధ్యాయురాలికి ఓ విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో వాంగ్ యున్ 2019 మార్చి 27న పిల్లలు తినే ఒక సూప్లో సోడియం నైట్రేట్ తో పాటు కొన్ని రసాయినాలు కలిపింది. అది విషపదార్ధంగా మారటంతో మొత్తం పిల్లలంతా అస్వస్థకు గురి అయ్యారు. ఆస్పత్రి పాలైన విద్యార్ధులు కోలుకున్నారు. కానీ వారిలో ఒక విద్యార్ది 10 నెలల చికిత్స అనంతరం మృతిచెందగా, వాంగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే ముందు కోర్టు ఆమెకు జైలు శిక్షను మాత్రమే విధించింది. తరువాత అది మరణ శిక్షగా మార్చింది.
విద్యార్ధులు అస్వస్థకు గురి అయిన వెంటనే స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఆస్పత్రికి తరలించి..పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అనుమానితురాలిగా వాంగ్ ను అరెస్ట్ చేశారు. అనంతరం విచారించగా నిజాన్ని అంగీకరించింది. ఈ క్రమంలో నాలుగేళ్లుగా విచారణ జరగటం..10 నెలల క్రితం విద్యార్ది చనిపోవటంతో వాంగ్ కు కోర్టు మరణశిక్ష విధించి అమలు చేసింది. హై స్కూల్ తో చదువు మానేసిన వాంగ్ 2000 క్రితం ఆన్లైన్లో కొనుగోలు చేసిన అదే పదార్థంతో భర్తపై కూడా విష ప్రయోగం చేసింది కానీ అతను బతికి బయటపడ్డాడు.