పంజాబ్‌లోని (Punjab) అమృత్‌సర్ జిల్లాలోని చన్ కలాన్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో చైనా తయారు చేసిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) 'పాక్షికంగా దెబ్బతిన్న' స్థితిలో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10న రాత్రి సమయంలో అమృత్‌సర్ జిల్లాలోని సరిహద్దు వెంబడి క్వాడ్‌కాప్టర్ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్ దళాలు అడ్డుకున్నాయి.
"ఫిబ్రవరి10, 2024న రాత్రి, అప్రమత్తమైన BSF దళాలు అమృత్‌సర్ జిల్లాలోని సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్ కదలికను అడ్డుకున్నాయి. ప్రోటోకాల్‌ను అనుసరించి, BSF క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT) డ్రోన్ కదలికను వెంటనే ట్రాక్ చేసింది" అని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
చైనా డ్రోన్ స్వాధీనం
బీఎస్ఎఫ్ పత్రికా ప్రకటన ప్రకారం, "డ్రాపింగ్ జోన్‌లో విస్తృతమైన సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభమైంది. సుమారు 09:12 pm, BSF దళాలు అమృత్‌సర్ జిల్లాలోని చన్ కలాన్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రం నుండి పాక్షికంగా దెబ్బతిన్న స్థితిలో చిన్న డ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది". స్వాధీనం చేసుకున్న డ్రోన్ క్వాడ్‌కాప్టర్, మోడల్ - DJI మావిక్ 3 క్లాసిక్. ఇది చైనాలో తయారైంది.