Covid Cases : కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. జాగ్రత్త: WHO

Update: 2024-08-10 09:45 GMT

కొన్ని వారాలుగా 84 దేశాల్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని WHO వెల్లడించింది. రానున్న రోజుల్లో మరిన్ని వేరియంట్లు వ్యాపించనున్నాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పారిస్ ఒలింపిక్స్‌లో దాదాపు 40 మంది అథ్లెట్లు కొవిడ్/శ్వాసకోశ వ్యాధుల బారిన పడినట్లు పేర్కొంది. కరోనా ఇప్పటికీ మనతోనే ఉందని WHO డాక్టర్ మరియా చెప్పారు. ఓవరాల్‌గా పాజిటివ్ కేసుల సంఖ్య 10%, ఐరోపాలో 20% పైగా ఉందని పేర్కొన్నారు.

డబ్ల్యూహెచ్ఓ డేటా ప్రకారం అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్‌లో కొత్త ఇన్ఫెక్షన్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉన్న దానికంటే 2 నుంచి 20 రేట్లు ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రమాదాన్ని తగ్గించగలమని డాక్టర్లు సూచించారు. పదోన్నతి పొందారు. గత 12-18 నెలల్లో వ్యాక్సిన్‌ల లభ్యత గణనీయంగా తగ్గిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. వ్యాక్సిన్‌ల ఉత్పత్తిదారుల సంఖ్య కూడా తగ్గిందని వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్ల మార్కెట్ ఉందని.. టీకాల ఉత్పత్తి పెంచాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది.

Tags:    

Similar News