South East Queensland: ఆగ్నేయ క్వీన్స్‌లాండ్‌లో క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన
9 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ఆగ్నేయ క్వీన్స్‌లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వడగళ్ళు, మెరుపులు, విధ్వంసక గాలులు, ఆకస్మిక వరదలు లక్షలాది మందిని అతలాకుతలం చేశాయి. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల సైజులో వడగళ్ల వాన కురవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ లైన్లు కూలిపోవడంతో, రాష్ట్రంలోని ఆగ్నేయ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎవరూ ఊహించిన విధంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బ్రిస్బేన్, సౌత్ ఈస్ట్ క్వీన్స్‌ల్యాండ్ ప్రాంతాలు ప్రకృతి కోపానికి కొద్ది రోజులుగా గురవుతున్నాయి. భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో గతంలో ఎన్నడూ చూడని విధంగా క్రికెట్ బంతి కంటే పెద్ద సైజులో వడగళ్ల వర్షం కురుస్తుంది. దాదాపు 9 సె. మీ సైజులో ఉన్న వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతంలోని పలు ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి, వాహనాల అద్దాలు పగిలిపోవడంతో పాటు.. చెట్లు నెలకొరిగాయి. ఈ భారీ వడగండ్ల వానతో దాదాపు 9 మంది గాయపడినట్లు సమాచారం. ఎస్క్‌లోని ఒక పాఠశాల ప్రదర్శనలో భారీ వడగళ్ల కారణంగా గాయపడిన అనేక మందికి పారామెడిక్స్ చికిత్స అందించారు. 30 ఏళ్ల మహిళ తల, మెడ గాయాలవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఈ తుపాను సూపర్‌సెల్ స్టార్మ్ రూపంలో ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వేడిగా ఉన్న గాలి, తేమ కలిసిపోవడంతో వడగళ్ల వాన తీవ్ర స్థాయికి చేరిందని వారు వెల్లడించారు. మైసూర్, టువుంబా, ప్రాటెన్ ప్రాంతాల్లో వడగండ్ల వానతో అత్యధికంగా నష్టం జరిగిందని తెలిపారు. గత వారం రోజులుగా క్వీన్స్‌ల్యాండ్‌లో వింత వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయని.. మరోసారి భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.