Nepal Earthquake : నేపాల్ భూకంపంలో 130కి పెరిగిన మృతుల సంఖ్య

Update: 2025-01-08 10:15 GMT

భూకంపం నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది. జిగాజ్ నగరంలో మంగళవారం ఉదయం 6.35 గంటల ప్రాంతంలో ప్రకంపనలు ఏర్పడ్డాయి. వీటి తీవ్రత 6.8గా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ప్రకంపనల ధాటికి పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కు కున్నట్లు సమాచారం. ఈ భూకంపం ధాటికి 130 మంది మరణించగా, మరో 190మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధి కారవర్గాలు వెల్లడించాయి. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కొన్ని క్షణాలపాటు తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాం దోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పశ్చిమ చైనాలో, నేపాల్ సరిహద్దుకు సమీపం లోని టిబెట్ రీజియన్ పర్వత ప్రాంతాల్లో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని చైనా ఎర్త్ క్వేక్ నెట్ వర్క్ సెంటర్ ధ్రువీకరించింది. ఈ భూకంపం తర్వాత టిబెట్ రీజియన్ లో మరో రెండుసార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయని, వీటి తీవ్రత 4.7,4.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News