Donald Trump : తొలిరోజే తన మార్క్ చూపించనున్న డొనాల్డ్ ట్రంప్

Update: 2025-01-20 18:30 GMT

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే పాలనపై తన ముద్ర స్పష్టంగా కనిపించాలని ట్రంప్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు ట్రంప్‌ ఈ సంతకాలు చేయనున్నారు. వాటిలో ముఖ్యంగా ఏడు అంశాలు ఉంటాయని తెలుస్తోంది. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, వలసదారుల డిపోర్టేషన్​, ట్రాన్స్​జెండర్ల హక్కులు కాలరాయడం, చమురు వెలికితీత పెంచడం, ప్రభుత్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, క్షమాభిక్షలు వంటి కార్యక్రమాలను తొలి రోజే మొదలుపెట్టాలని ట్రంప్ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

అంబానీ దంపతులు ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొననున్నారు. అంబానీ కుటుంబానికి ట్రంప్ కుటుంబం ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈఓ జెఫ్ బెజోస్‌, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌లు కూడా హాజరుకున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరుకానున్నారు. పలు దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Tags:    

Similar News