దుబాయ్ యువరాణి తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఇన్‌స్టాలో ముమ్మారు తలాక్ చెప్పేసింది. తమ దాంపత్య బంధానికి పుల్స్టాప్ పెట్టేసింది. తనభర్త షేక్ మనాబిన్ మొహమ్మద్ బిన్ అల్ మక్తూమ్ నుండి విడాకులు తీసుకున్నట్లు బహిరంగంగా వెల్లడించింది.
షేఖా మహరా దంపతులు తమ మొదటి బిడ్డ పుట్టిన కొద్ది నెలల తర్వాత ఈ ప్రకటన చేశారు. "ప్రియమైన భర్తకు అంటూ తన సందేశాన్ని ప్రారంభించిన యువరాణి, మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందున మీతో విడాకులు తీసుకోవాలని నిశ్చ యించుకున్నా. ఐ డైవోర్స్ యూ.. ఐ డైవోర్స్ యూ.. ఐ డైవోర్స్ యూ.. టేక్ కేర్.. ఇట్లు మీ మాజీ భార్య" అని యువరాణి షైఖా మహ్రా ఇన్స్టాలో పోస్టు చేసింది.
ఈ వార్త నిముషాల వ్యవధిలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ జంట ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు Unfollow చేసుకున్నారు. సం బంధిత ప్రొఫైల్ల నుండి ఒకరి ఫోటోలను ఒకరు తొలగి౦చుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సోషల్ మీడియా వినియోగదారులు విడాకుల సమాచారాన్ని వైరల్ చేశారు.