America: తిండి పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని మృతి.. ఏం తిన్నాదంటే..

America: మామూలుగా పోటీ అనగానే మనకు ఏ పరుగు పోటిలాంటిదో గుర్తొస్తుంది.

Update: 2021-10-30 14:38 GMT

eating competition (tv5news.in)

America: మామూలుగా పోటీ అనగానే మనకు ఏ పరుగు పోటిలాంటిదో గుర్తొస్తుంది. అవే మనం ఎక్కువగా వింటూ ఉంటాం కాబట్టి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు తిండి పోటీలు కూడా ట్రెండింగ్‌గా మారాయి. ఒక రకంగా ఈ పోటీలు ఫ్యాషన్ అయిపోయాయి కూడా. కానీ ఈ పోటీ వల్ల అమెరికాలో ఓ విద్యర్థిని ప్రాణం కోల్పోయింది.

అమెరికాలో టఫ్ట్స్‌ యూనివర్సిటీలో గతవారం తిండి పోటీలు జరిగాయి. అందులో భాగంగానే విద్యార్థులు హాట్ డాగ్‌లు తినాలి. అందరు విద్యార్థులు ఈ కాంపిటీషన్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపించారు. అందులో ఒకరు 20 ఏళ్ల విద్యార్థిని మడ్లిన్. పోటీలో త్వరత్వరగా హాట్ డాగ్ తింటున్న సమయంలో మడ్లిన్‌కు ఒక హాట్ డాగ్ గొంతులో ఇరుక్కుపోయింది.

హాట్ డాగ్ గొంతుల్లో ఇరుక్కుపోయిన తర్వాత మడ్లిన్ ఊపిరాడక ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది. అది గుర్తించిన కాలేజ్ యాజమాన్యం తనను హుటాహుటిన బోస్టన్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ ఏమీ లాభం లేకపోయింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా తన ప్రాణాలను కాపాడలేకపోయారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఒకరోజు తరువాత ఆమె మరణించిందని వైద్యులు వెల్లడించారు. ఈ వార్తతో కాలేజీలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags:    

Similar News