Elon Musk : ఇండియాకు ఎలాన్ మస్క్ హ్యాండ్

Update: 2024-05-23 09:22 GMT

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇండియాకు వస్తున్నట్లు ప్రధాని మోదీని కలవనున్నట్లు వార్తలు వచ్చాయి. టెస్లా ప్లాంట్ ఇండియాలో ఏర్పాటుకు చర్చలు జరగొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అప్పట్లో చివరి క్షణంలో తన ప్రయాణాన్ని మస్క్ విరమించుకుని చైనాలో అకస్మాత్తుగా పర్యటించారు.

ప్రస్తుతం మస్క్ శ్రీలంకకు వెళ్లనున్నారు. టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తన స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలను అమలు చేయడం కోసం శ్రీలంక వైపు చూస్తున్నారు. మస్క్ తన భారత పర్యటనను రద్దు చేసుకుని, బదులుగా చైనా, ఇండోనేషియాలను సందర్శించిన తర్వాత శ్రీలంకకు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. ఇండియా చుట్టూ ఉన్న దేశాలను ఆయన చుడుతున్నారు.

మస్క్ భారతదేశంలో ఏప్రిల్ 20-ఏప్రిల్ 22 తేదీల్లో భారతదేశాన్ని సందర్శించాల్సి ఉంది. అయితే చివరి క్షణం లో అది రద్దయింది. దురదృష్టవ శాత్తూ భారీ టెస్లా బాధ్యతల కారణంగా భారతదేశ సందర్శన ఆలస్యం అవుతున్నట్లు ఎలాన్ మస్క్ టీమ్ అంటోంది.

Tags:    

Similar News