Elon Musk: ట్విటర్ యూజర్లకు మస్క్ వార్నింగ్..
Elon Musk: ట్విటర్‌ను చేజిక్కించుకున్నాక ఉద్యోగులకు వరుస షాక్‌లు ఇస్తున్న ఎలన్ మస్క్.. ఈసారి ట్విటర్ యూజర్లకు వార్నింగ్ ఇచ్చారు.;
Elon Musk: ట్విటర్‌ను చేజిక్కించుకున్నాక ఉద్యోగులకు వరుస షాక్‌లు ఇస్తున్న ఎలన్ మస్క్.. ఈసారి ట్విటర్ యూజర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ఎలన్ మస్క్ అనే పేరుతో ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేసినా.. అకౌంట్ పేరును మస్క్‌గా మార్చినా.. ఖాతాను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ట్విటర్ డిస్‌ప్లేలో ఖాతా పేరుకు బదులు వేరొక పేరును వాడితే.. శాశ్వతంగా ట్విటర్ నుంచి ఆ ఖాతాను తొలగిస్తామని హెచ్చరించారు. కొంత మంది తమ డిస్‌ప్లే పేరును ఎలన్ మస్క్‌గా మార్చి ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఎలన్ మస్క్‌కు చిర్రెత్తుకొచ్చింది.
అయితే, ట్విటర్ యూజర్లు కావాలనే, ఓ వ్యూహం ప్రకారం.. తమ అకౌంట్ పేరును ఎలన్ మస్క్‌గా మార్చుకుంటున్నారు. ట్విటర్ బ్లూటిక్ ఖాతాలకు నెలకు 8 డాలర్ల చొప్పున ఫీజు విధించాలని మస్క్ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు సెలబ్రిటీలు తమ ట్విటర్ హ్యాండిళ్లలో మస్క్ ఫొటో, పేరు పెట్టి నిరసన తెలిపారు. దీనిపై ఎలన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. అకౌంట్ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు గతంలో ట్విటర్ హెచ్చరికలు జారీ చేసేదని, ఇకపై హెచ్చరికలు ఏమీ ఉండవని, ఏకంగా అకౌంట్‌ను తొలగిస్తామని చెప్పుకొచ్చారు మస్క్. ఏ ఇతర పేరుకు తమ డిస్‌ప్లేను మార్చినా, బ్లూటిక్‌ను తాత్కాలికంగా కోల్పోతారని వార్నింగ్ ఇచ్చారు.
ట్విటర్ తన చేతికి వచ్చిన తర్వాత నుంచి ఎలన్ మస్క్ దూకుడు పెంచారు. ఇష్టమొచ్చిన మార్పులు చేస్తూ.. అటు ఉద్యోగులతో పాటు ఇటు యూజర్లకు కూడా ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ట్విటర్ నుంచి ఆదాయం పెంచుకోవాలన్న ఉద్దేశంతో.. ట్విటర్ బ్లూటిక్ కోసం నెలకు 8 డాలర్ల చొప్పున ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు.
బ్లూటిక్ ఖాతాలకు నెలకు 8 డాలర్ల వసూలును తప్పుబడుతూ కొందరు తమ ట్విటర్ హ్యాండిళ్లలో మస్క్ ఫొటో, పేరు పెట్టి నిరసన తెలుపుతున్నారు. దీనిపై ట్విటర్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ డిస్‌ప్లేలో ఖాతా పేరుకు బదులు వేరొక పేరు వాడితే.. అలాంటి అకౌంట్లను శాశ్వతంగా ట్విటర్ నుంచి తొలిస్తామని మస్క్ వార్నింగ్ ఇచ్చారు.