బీరూట్‌ పోర్టులో మళ్లీ భారీ అగ్ని ప్రమాదం

Update: 2020-09-11 01:08 GMT

లెబెనాన్‌ రాజధానిలో వరుస ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. బీరూట్‌ పోర్టులో జరిగిన భారీ పేలుళ్ల ఘటన మర్చిపోకముందే మళ్లీ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపింది. టైర్లు, ఆయిల్‌ నిల్వ ఉంచిన గోడౌన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, సహాయక సిబ్బంది.. హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపు చేశారు. ఈ మంటలతో దట్టంగా పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల వారు ఉక్కిరిబిక్కిరయ్యారు.

బీరూట్‌లో ఆగస్టు 4న చోటు చేసుకున్న భయానక పేలుడు ఘటనలో 191 మంది మరణించారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచిన గోడౌన్‌లో అగ్నిప్రమాదం జరిగి ఆ ప్రాంతాన్ని మృతుల దిబ్బగా మార్చేసింది. నాటి ఘటన బీరూట్ వాసులను నేటికీ పీడ కలలా వేధిస్తోంది. ఆ ప్రమాదంలో వేలాది మంది గాయపడ్డారు. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా కంపించింది. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. దీంతో వరుస ప్రమాదాలతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు.

Tags:    

Similar News