మాజీ గూగుల్ టెకీ కొత్త ఉద్యోగం.. వారానికి మూడు గంటలు పని.. నెలకు రూ. 2.6 లక్షల జీతం
షావో చున్ చెన్ తన ఉద్యోగం కోసం వారానికోసారి థాయిలాండ్ నుండి సింగపూర్ కు ప్రయాణిస్తుంటాడు.;
షావో చున్ చెన్ తన ఉద్యోగం కోసం వారానికోసారి థాయిలాండ్ నుండి సింగపూర్ కు ప్రయాణిస్తుంటాడు. సింగపూర్‌లో తన కార్పొరేట్ కెరీర్‌లో వారానికి 40 గంటలకు పైగా పనిచేసిన చున్ఏ ఇప్పుడు వారానికి మూడు గంటల ఉద్యోగం చేస్తున్నాడు. థాయిలాండ్‌లో తన కుటుంబం ఉంటుంది. షావో చున్ చెన్ తన భార్యతో కలిసి థాయిలాండ్‌లో నివసిస్తున్నానని మరియు సింగపూర్ నేషనల్ యూనివర్శిటీలో అనుబంధ లెక్చరర్‌గా పనిచేయడానికి వారానికి ఒకసారి సింగపూర్‌కు ప్రయాణిస్తుంటానని వెల్లడించాడు. నెలకు రూ. 2.6 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు.
వారానికి మూడు గంటల డిజిటల్ మార్కెటింగ్ బోధిస్తుంటానని చెన్ మీడియాకు తెలిపాడు. తన 38వ పుట్టినరోజు నాడు తనను గూగుల్ నుంచి తొలగించారని చెన్ వెల్లడించారు. దాదాపు దశాబ్దం పాటు గూగుల్ లో పనిచేసినట్లు తెలిపాడు. తన ఆదాయానికి తగ్గట్టుగా జీవించానని, తన జీతంలో సగం వరకు పెట్టుబడుల కోసం కేటాయించానని పేర్కొన్నాడు. అయితే, ఊహించని విధంగా ఉద్యోగం నుంచి తొలగించబడిన తర్వాత, తాను సంవత్సరాలుగా నిర్మించుకున్న ఏడు అంకెల పోర్ట్‌ఫోలియో వలన ఎక్కువ కాలం జీతంపై ఆధారపడాల్సిన అవసరం లేదని గ్రహించాడు.
"నా జీవితంలో గత 14 సంవత్సరాలుగా నేను పని చేస్తున్నాను, తొలగింపు కారణంగా, నేను విరామం తీసుకోవలసి వచ్చింది. ఇది నా అహానికి, నా గుర్తింపుకు పెద్ద దెబ్బ, కానీ కాలక్రమేణా జీవితంలో నేను నిజంగా ఏమి కోరుకుంటున్నానో దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాను అని మిస్టర్ చెన్ అన్నారు.
ఉద్యోగం నుండి తొలగించబడిన తర్వాత, తన మనసుకు నచ్చిన పనులు చేయాలని, అవి ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు. విశ్వవిద్యాలయంలో బోధించడమే కాకుండా, YouTubeలో విద్యా కంటెంట్‌ను సృష్టించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చని ఆలోచించి ముందడుగు వెశాడు. అలా అతడు గంటకు $500 వసూలు చేస్తానని పంచుకున్నాడు.
"మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. గంటకు అధిక రేటు వసూలు చేయగల స్థితికి చేరుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనండి" అని చెన్ అన్నారు.
సింగపూర్ కంటే జీవన వ్యయం చాలా తక్కువగా ఉన్న థాయిలాండ్‌లో తన భార్యతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి తాను అంతగా పని చేయాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు.
అధిక గంట రేటు చెల్లించగల నగరాలు, ఉద్యోగాలు ఖరీదైన ప్రాంతాలుగా ఉంటాయి. కానీ డిజిటలైజేషన్ రిమోట్ వర్క్ ఏర్పాట్లను సాధ్యం చేసినందున ఇప్పుడు అది తక్కువ సమస్య అని ఆయన అన్నారు.
ఇంకా చెన్ మాట్లాడుతూ, తాను వారానికి నాలుగు నుండి ఎనిమిది గంటలు పని చేస్తానని, అందులో బోధన, శిక్షణ, యూట్యూబ్ వీడియోలను తయారు చేయడం కూడా ఉందని అన్నారు.