CHINA: జపాన్ సీ ఫుడ్స్‌పై చైనా నిషేధం
అణుజలాల విడుదల నేపథ్యంలో నిర్ణయం.... వెంటనే అమల్లోకి నిషేధం...
ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం నుంచి(Fukushima wastewater) అణుజలాలను సముద్రంలోకి విడుదలచేస్తున్న నేపథ్యంలో( Japan started releasing treated radioactive water) జపాన్ నుంచి వచ్చే సముద్ర సంబంధ ఆహారపదార్థాలపై చైనా నిషేధం( China bans all Japanese seafood) విధించింది. అణుధార్మిక జలాలను సముద్రంలోకి విడిచిపెట్టడంపై జపాన్ మత్స్యకారులు సహా చైనా, దక్షిణకొరియా వంటి దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ అంశం రాజకీయ, దౌత్యపరమైన సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ సీఫుడ్ పై చైనా నిషేధం విధించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని(immediate blanket ban) చైనా కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చైనా నిషేధం కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నవారికి పరిహారం చెల్లిస్తామని టోక్యో ఎలక్ట్రిక్ కంపెనీ హోల్డింగ్స్ అధ్యక్షుడు ప్రకటించారు.అ ణుజలాల విడుదలకు సంబంధించిచైనాకు శాస్త్రీయ అంశాలు వివరించి నిషేధం తొలిగించేలా చూస్తామని చెప్పారు.
పసిఫిక్ మహాసముద్రంలోకి జపాన్ తొలి విడత అణుజలాల విడుదలను ప్రారంభించింది. సునామీ దెబ్బతో నిరుపయోగంగా మారిన ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియో యాక్టీవ్ నీటిని తొలిసారిగా విడుదల చేశారు. కంట్రోల్ రూమ్‌లో టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ హోల్డింగ్స్ సిబ్బంది.. నీటి పంపును ఆన్ చేసి సముద్రంలోకి విడుదల చేసే వివాదాస్పద ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కొన్ని దశాబ్ధాల పాటు సాగనుంది.
ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో ప్రస్తుతం 1.34 మిలియన్ టన్నుల అణువ్యర్థ జలాలు నిల్వ చేసి ఉంచారు. వెయ్యి ట్యాంకుల్లో ఈ రేడియో యాక్టీవ్ నీరు పోగుబడి ఉంది. 2023లో 31 వేల టన్నుల అణు వ్యర్థ జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేయాలని జపాన్ యోచిస్తోంది. 4 విడతలుగా ఒక్కో దఫాలో 7వేల 8వందల టన్నుల అణు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టనున్నారు.
జపాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని చైనా, దక్షిణ కొరియాతో సహా.. పసిఫిక్ ద్వీప దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జపాన్‌ది స్వార్థపూరిత, బాధ్యతారాహిత్య చర్య అని చైనా మండిపడింది. మానవాళికే జపాన్ ముప్పు తెచ్చిందని ఆక్షేపించింది. జపాన్ నుంచి దిగుమతి చేసుకునే సముద్ర ఆహార ఉత్పత్తులపై నిషేధం విధించింది. దక్షిణకొరియా కూడా సునామీ ప్రభావిత ప్రాంతాల్లో వేటాడిన చేపలు, వ్యవసాయ ఉత్పత్తులపై నిషేధాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. జపాన్ చర్య వల్ల తమ ప్రజలకు ఎలాంటి హానీ జరగకుండా అన్ని జాగ్రత్తలు చేపడతామని హామీ ఇచ్చింది.