మహిళ నోట్లో నుంచి పాముని.. వీడియో వైరల్
అంత పెద్ద పాము ఆమె కడుపులోకి ఎలా వెళ్లిందో.. దాన్ని అలానే ఎలా బయటకు తీస్తున్నారో.. అది ఇంకా బతికే ఉందో లేదో తెలియదు.
అంత పెద్ద పాము ఆమె కడుపులోకి ఎలా వెళ్లిందో.. దాన్ని అలానే ఎలా బయటకు తీస్తున్నారో.. అది ఇంకా బతికే ఉందో లేదో అర్థమే కావట్లేదు. రష్యాలో చిత్రీకరించిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్స్ ని భయభ్రాంతులకు గురిచేసిన ఈ వీడియోలోని మహిళ నోటి నుంచి ఆస్పత్రి సిబ్బంది 4 అడుగుల పొడవున్న పామును బయటకు తీసారు. ఆస్పత్రిలో ఆ మహిళ అపస్మార స్థితిలో పడి ఉండగా వైద్యులు ఆమె నోటి నుండి పామును బయటకు తీశారు. ఆమె శరీరంలో మరిన్ని సరీసృపాలు ఉండి ఉంటాయని ఆస్పత్రి సిబ్బంది భావిస్తున్నారు.
పామును బయటకు తీసిన నర్సు ముఖంలో భయం చోటు చేసుకున్న విషయం వీడియోలో కనిపిస్తుంది. మహిళ నోటి నుంచి బయటకు తీసిన పాముని మెడికల్ బాక్సులో వేస్తుంది. మహిళ కాగేపియన్ సముద్రం వెంట నడిచే పర్వత ప్రాంతం అయిన డాగేస్టాన్ లోని లెవాషి గ్రామానికి చెందినది. పాము మహిళ శరీరంలో ఉందన్న విషయం తెలిసి గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు. పూర్వకాలంలో ఇంటి బయట నిద్రిస్తే చెవిలోకి పురుగు, పుట్రా చేరతాయని అనేవారు. అలా ఏమైనా వెళ్లిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. అందుకే ఆరుబయట నిద్రించడం అంత మంచిది కాదు అని సలహా కూడా ఇస్తున్నారు.
زحف عبر فمها أثناء نومها.. فيديو مروع للحظة سحب ثعبان من حلق امرأة https://t.co/6iUSk3oU2U#البيان_القارئ_دائما pic.twitter.com/3Q1YiYdV7R
— صحيفة البيان (@AlBayanNews) August 31, 2020