Google: గూగుల్‌లో ఉద్యోగం అదే అతడి ధ్యేయం.. 39 సార్లు రిజెక్ట్ 40వ సారి సక్సెస్..
Google: అనుకున్న వెంటనే అయిపోవాలి.. లేకపోతే నిరుత్సాహం.. తమని తాము తక్కువ అంచనా వేసుకోవడం..;
Google: అనుకున్న వెంటనే అయిపోవాలి.. లేకపోతే నిరుత్సాహం.. తమని తాము తక్కువ అంచనా వేసుకోవడం.. తమ ఖర్మ ఇంతే అనుకుని బాధపడడం.. అదృష్టం లేదని విచారించడం. ఇది కాదు సక్సెస్ అంటే ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి. తాము కన్న కలల కోసం నిరంతరం ప్రయత్నించాలి.. నిరుత్సాహపడకూడదు.. ఓటమిని అంగీకరించకూడదు.. అదే అతడు చేసిన పని.. నాలుగైదు సార్లు కాదు నలభై సార్లు ప్రయత్నించాడు. ఆఖరికి అనుకున్నది సాధించాడు. ఉద్యోగం సంపాదించాడు.. గూగుల్‌లో ఉద్యోగం సంపాదించడం కొందరికి కల. పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తుంటారు.. ఇంటర్వ్యూల్లో అన్ని రౌండ్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నా ఎక్కడో ఏదో ఒక పాయింట్లో దొరికిపోయి రిజెక్ట్ చేయబడుతుంటారు కొందరు.
కానీ టైలర్ కోహెన్ అలా కాదు.. అప్పటికే 39 సార్లు ప్రయత్నించాడు.. చివరి ప్రయత్నంగా 40వ సారి ట్రై చేశాడు. ఎట్టకేలకు గూగుల్‌లో ఉద్యోగం పొందాడు. కోహెన్ లింక్డ్‌ఇన్‌లో స్ఫూర్తిదాయకమైన కథను పంచుకున్నాడు మరియు Googleతో తన కమ్యూనికేషన్ యొక్క స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. టైలర్ కోహెన్ Googleలో ఉద్యోగం పొందడానికి ముందు డోర్‌డాష్‌లో అసోసియేట్ మేనేజర్ - స్ట్రాటజీ & ఆప్స్‌గా పనిచేశారు.
అతను మొదట 2019 ఆగస్టులో టెక్ దిగ్గజంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కనిపిస్తోంది. అతను తిరస్కరించబడ్డాడు. అతను సెప్టెంబర్ 2019లో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నాడు. రెండుసార్లు తిరస్కరించబడ్డాడు. అతను విరామం తీసుకున్నాడు మరియు జూన్ 2020లో మహమ్మారి సమయంలో మళ్లీ దరఖాస్తు చేయడం ప్రారంభించాడు, కానీ అతను చివరకు Google ద్వారా ఎంపిక చేయబడిన జులై 19, 2022 వరకు ప్రతిసారీ తిరస్కరించబడ్డాడు.
మరీ ఇంత పట్టుదల పనికిరాదని కొందరంటే, ఇదేం పిచ్చిరా ఇన్ని సార్లు రిజెక్ట్ అయినా ఇంకా ప్రయత్నిస్తావా.. నువు ఉద్యోగం చేయడానికి దేశంలో ఇంక ఏ కంపెనీలు లేవా.. అందులో కాకపోతే మరోదాన్లో ప్రయత్నించు అని స్నేహితులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇంతకీ తనకు పిచ్చి ఉందా లేక పట్టుదల ఉందా అనేది తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే 40వ సారీ ప్రయత్నించాడు. ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. "ఎన్నిసార్లు ప్రయత్నించావు టైలర్! ఇప్పటికి విజయం సాధించావు " అని గూగుల్ అతడికి పోస్ట్ పెట్టింది. అతడి పట్టుదల చూసి అపజయం పారిపోయింది.. విజయం వరించింది అని నెటిజన్లు అతడి విజయగాధను చదివి కామెంట్లు పెడుతున్నారు.