Mexico: మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం-12మంది మృతి

బ్యాటరీ రీసైక్లింగ్‌ ప్లాంట్‌లో పేలుడు;

Update: 2024-11-01 03:15 GMT

అమెరికాలోని మెక్సికో నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెక్సికో ముస్సోరిలోని ఓ బ్యాటరీ రీసైక్లింగ్‌ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మిస్సోరీలోని లిథియం బ్యాటరీ ప్లాంట్‌లో జరిగిన ఈ ప్రమాదంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను భయపెట్టింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

మెక్సికో నగరానికి తూర్పున 140 కిలోమీటర్ల దూరంలోని అక్లోజ్‌టోక్‌లో ఈ పేలుడు సంభవించినట్లు త్లాక్స్‌కాలా స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. కార్మికుల నుండి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం కరిగిన ఉక్కు.. నీటి పరిధిలోకి రావడంతో పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి. బాధిత కుటుంబాలను త్లాక్స్‌కలా గవర్నర్ లోరెనా క్యూల్లార్ పరామర్శించారు. ఈ ఉదంతం దర్యాప్తు పూర్తయ్యేంతవరకూ ప్లాంట్‌ను మూసివేయనున్నారని సమాచారం. 

Tags:    

Similar News