Largest iPhone:‘గిన్నిస్’లోకి భారత సంతతి యూట్యూబర్
అతిపెద్ద ఐఫోన్ నమూనాతో గిన్నిస్ రికార్డ్;
యాపిల్ సంస్థ తయారు చేసే ఐఫోన్ లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం టాప్ ఎండ్ ‘ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ’ను.. 6.7 అంగుళాల స్క్రీన్‌తో ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ మైనీ.. ఏకంగా 6.74 అడుగుల పొడవైన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రతిరూపాన్ని రూపొందించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ప్రతిరూపంగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది.
‘మిస్టర్‌హూజ్‌దబాస్ పేరిట టెక్నాలజీకి సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ యూట్యూబ్‌లో అరుణ్ పేరుపొందాడు. ఈ క్రమంలోనే మాథ్యూ పెర్క్స్ అనే గ్యాడ్జెట్ స్పెషలిస్ట్‌తో కలిసి ఈ భారీ ఐఫోన్ రూపాన్ని తయారు చేశాడు. ఇందులో భారీ కెమెరాలు అమర్చాడు. గేమింగ్ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు. దీన్ని స్టాండ్‌పై అమర్చి స్థానిక వీధుల్లోకి తీసుకెళ్లగా.. ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో ఇదే తరహాలో అమెరికాకు చెందిన మాథ్యూ బీమ్, జెడ్‌హెచ్‌సీ అనే యూట్యూబర్లు భారీ ఐఫోన్‌లను రూపొందించారు.