ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌లో ఆకలి కేకలు పెరుగుతున్నాయి. పాక్ పాలకులు అక్కడి ప్రజలను గాలికి వదిలేసి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. దీంతో పాకిస్థాన్ లో తీవ్ర ఆహార సంక్షోభ పరస్థితులు నెలకొంటున్నాయి. ఈ పిస్థితిని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక ధృవీకరించింది. పాకిస్తాన్‌లోని దాదాపు 11 మిలియన్ల మందిపై ఈ ఆహార కొరత ప్రభావం ఉందని ఇక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2024 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు పాక్ లో అధిక స్థాయిలో ఆహార సంక్షోభం కొనసాగిందని వెల్లడైంది.
ఆహార సంక్షోభాలపై ప్రపంచ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం బలూచిస్థాన్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి వరద ప్రభావిత జిల్లాల్లో 11 మిలియన్ల మంది తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటారని అంచనా వేసింది. ఇందులో 1.7 మిలియన్ల మంది అత్యవసర పరిస్థితిలో ఉన్నారు. 2024 గరిష్ఠ స్థాయి ఆహార కొరతతో పోలిస్తే 2025లో మరో 38 శాతం పెరిగే అవకాశం ఉంది.
శీతాకాలంలో బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ లోని 43 గ్రామీణ జిల్లాల్లో 11.8 మిలియన్ల మంది తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గర్భిణీలు, బాలింతల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. అలాగే సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో చాలా మంది చిన్నారులు తక్కువ బరువుతో జన్మిస్తున్నా తెలిపింది. ఆహార కొరతకు తోడు పారిశుద్ధ్య సౌకర్యాలు, సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడైంది.