Elon Musk : నేను ఏలియన్‌ని.. సాక్ష్యాలను చూపించిన ఎలాన్ మస్క్..పోస్ట్ వైరల్.
Elon Musk : ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెక్ దిగ్గజాలు అయిన స్పేస్‌ఎక్స్, టెస్లా, న్యూరాలింక్ వంటి కంపెనీల యజమాని ఎలన్ మస్క్ చేసిన ఒక సరదా వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. అందులో ఆయన తనను తా ఏలియన్‌ని అని చెప్పుకున్నాడు."నేను ఏలియన్‌ని అని ప్రజలకు చెప్తూనే ఉన్నాను. కానీ ఎవరూ నమ్మట్లేదు. దానికి ప్రభుత్వపరమైన సాక్ష్యం కూడా ఉంది" అంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్య గత సంవత్సరం పారిస్‌లో జరిగిన Viva Tech ఈవెంట్లో చేసినది. మస్క్ ఈ ప్రోగ్రామ్‌లో వర్చువల్‌గా పాల్గొని.. "ఎలాన్ మస్క్ గురించి మీరు ఎప్పుడూ తెలుసుకోవాలనుకున్న విషయాలు, కానీ అడగడానికి భయపడిన విషయాలు" అనే సెషన్‌లో ఈ ప్రశ్నను ఎదుర్కొన్నారు. మస్క్ తన మాటలకు సాక్ష్యం చూపిస్తూ తన గ్రీన్ కార్డ్‌పై ఏలియన్ రిజిస్ట్రేషన్ అని రాసి ఉందని చెప్పారు. ఇదే ప్రభుత్వపరమైన ఆధారం అని నవ్వుతూ పేర్కొన్నారు.
https://x.com/MarioNawfal/status/1989456876317069520?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1989456876317069520|twgr^85b9c024c362a926fbd41c14b5b92e9e4556f414|twcon^s1_&ref_url=https://www.abplive.com/business/statement-by-elon-musk-is-going-viral-on-social-media-in-which-he-is-seen-calling-himself-an-alien-3044870
వాస్తవానికి యునైటెడ్ స్టేట్స్‌లో గ్రీన్ కార్డ్ అనేది శాశ్వత నివాసులకు ఇచ్చే అధికారిక గుర్తింపు కార్డు. దీనిని అధికారికంగా ఏలియన్ రిజిస్ట్రేషన్ కార్డ్ అని కూడా పిలుస్తారు. ఇది కేవలం అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో భాగమే తప్ప, మస్క్ నిజంగా ఏలియన్ అని దానర్థం కాదు. అయినప్పటికీ మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన అంతరిక్షం నుంచి వచ్చారనే పుకార్లకు మరింత ఆజ్యం పోశాయి.
ఈ సందర్భంగా ఎలన్ మస్క్ తాను ఓపెన్‌ఏఐని ఏర్పాటు చేయడానికి గల కారణాలను కూడా వివరించారు. ఆయనకు కృత్రిమ మేధస్సు వల్ల భవిష్యత్తులో కలిగే ప్రమాదాల గురించి తీవ్ర ఆందోళన ఉండేదట. ఒకసారి తన పుట్టినరోజు పార్టీ సందర్భంగా గూగుల్ సహ-వ్యవస్థాపకుడు, మస్క్‌కు సన్నిహితుడైన లారీ పేజ్ మాట్లాడుతూ.. మస్క్ యంత్రాల కంటే మానవులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారట.
ఈ మాట మస్క్‌ను బాగా కలచివేసింది. ఎందుకంటే లారీ పేజ్‌కు టీమ్ హ్యుమానిటీ గురించి పట్టదు, AI ప్రమాదం గురించి కూడా ఆయన పట్టించుకోరని మస్క్ భావించారు. అందుకే గూగుల్‌కు ఒక విధంగా బ్యాలెన్స్ చేయగలిగే ఒక వ్యవస్థను సృష్టించాలని ఆయన అనుకున్నారు. ఈ ఆలోచన నుంచే OpenAI ను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. OpenAI అంటే 'ఓపెన్ సోర్స్ ఏఐ' అని అర్థం. దీని కమాండ్ కేవలం కొన్ని కంపెనీల చేతిలోనే కాకుండా, అందరికీ అందుబాటులో సురక్షితంగా ఉండాలనేది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.