Donald Trump : నేనే అణుయుద్ధం ఆపాను: డొనాల్డ్ ట్రంప్

Update: 2025-05-17 10:15 GMT

పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు తాను ప్రయత్నించానని, రెండు అతిపెద్ద అణ్వాయుధ దేశాల మధ్య న్యూక్లియర్ వార్ జరగకుండా ఆపగలిగానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రెండు దేశాలు అణు యుద్ధం అంచుల దాకా వెళ్లాయని, తాను ఆపకుంటే భారీ నష్టం వాటి ల్లేదని అన్నారు. నిన్న పాక్స్ న్యూస్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. యుద్ధంలో ఉపయోగించే క్షిపణులు సాధారణమేనని, కానీ ఈ రెండు దేశాలు 'ఎన్' (న్యూక్లియర్) వరకు వెళ్లాయని అన్నారు. దీంతో తాను ఎంటర్ అయ్యానని, అణుయుద్ధం ఆపానని చెప్పారు. పహెల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్ లోని 9 ఉగ్రస్థావరాలను మట్టుపెట్టింది. పాకిస్తాన్ లోని 11 వైమానిక స్థావరాలలోని రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. మే 10న రెండు దాయాది దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ఈ రెండు దేశాల కన్నా ముందే ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఆ తర్వాత భారత్, పాక్ వేర్వేరుగా కాల్పుల విరమణపై ప్రకటనలు చేశాయి. ఈ ఇంటర్వ్యూ లో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా వ్యాపారం చేయబోతోందని, ఎగుమతి, దిగుమతులపై సానుకూల వాతావరణం కోసం ప్రయత్నిస్తుం దని చెప్పారు. ప్రపంచంలో శాంతి నెలకొనాల కోరుకుంటోందని అన్నారు.

Tags:    

Similar News