ప్రసిద్ధ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ఛాన్సులర్ పదవికి పోటీ చేసేందుకు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, రిటైర్డ్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయన సహాయకుడు సయీద్ జుల్ఫీ భుఖారీ వెల్లడించారు. 71 ఏళ్ల వయసున్న ఇమ్రాన్ ఖాన్ దరఖాస్తును భుఖారీ ఇప్పటికే దాఖలు చేసినట్లు పాకిస్తాన్ దినపత్రిక డాన్ తెలిపింది.
నామినేషన్ దాఖలు గడువు ఆదివారంతో ముగిసింది. ఈ ఛాన్స్ లర్ పదవికి ఎన్నికలు అక్టోబర్ 28న జరుగనున్నాయి. కాగా, అక్టోబర్ తొలి వారంలో పోటీపడుతున్న అభ్యర్థుల జాబితాను విశ్వవిద్యాలయం వెల్లడిస్తుంది. కాగా, నామినేషన్ ఓటింగ్ ఆన్లైన్లో జరిగే వెసులుబాటును కల్పించారు. ఇమ్రాన్ ఖాన్ 1970లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ లో పట్టా అందుకున్నారు. గతంలో ఈయన బ్రాడ్ఫోర్డ్ యూనివర్శిటీకి దాదాపు ఎనిమిదేళ్లపాటు ఛాన్సులర్ గా పనిచేశారు.