Anita Anand: కెనడా రక్షణ శాఖ మంత్రిగా భారత మహిళ..

Anita Anand: కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌కు కీలక పదవి దక్కింది.

Update: 2021-10-27 05:15 GMT

Anita Anand (tv5news.in)

Anita Anand: కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌కు కీలక పదవి దక్కింది. మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో.. ఆమెను నూతన రక్షణ మంత్రిగా మంగళవారం నియమించారు. ఆమె వయసు 54 ఏళ్లు. కెనడా రక్షణ మంత్రిగా ఉన్న భారత సంతతికే చెందిన హర్జీత్‌ సజ్జన్‌ స్థానంలో అనిత తాజా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇది వరకు రక్షణ మంత్రిగా ఉన్న హర్జీత్‌ సజ్జన్‌‌ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖకు బదిలీ చేసినట్టు సమాచారం. లైంగిక వేధింపుల ఆరోపణలకు బదులుగా యాక్షన్ తీసుకొని కెనడా మిలిటరీపై ఒత్తిడి పడింది. అందుకే ఉన్నపళంగా ఈ బదిలీలు జరిగాయి అంటోంది కెనడా మీడియా. అనితా ఆనంద్ రక్షణ శాఖ మంత్రిగా ఉంటే కెనడా మిలీటరీలో ఒత్తిడి తగ్గుతుందని తన పేరును ముందుకు తీసుకొచ్చారట ప్రముఖులు.

కెనడాలో రక్షణ శాఖ మంత్రులుగా ఇప్పటివరకు ఎక్కువశాతం పురుషులే ఉన్నారు. రక్షణ శాఖకు మంత్రిగా వ్యవహరించిన మహిళల్లో అనితా ఆనంద్ రెండోవారు. అది కూడా ఒక భారతీయ మహిళ ఈ బాధ్యతలు స్వీకరించడం మన దేశానికి గర్వకారణం. ఈ పదవి స్వీకరించడంపై అనితా ఆనంద్ సంతోషం వ్యక్తం చేశారు. 


Tags:    

Similar News