ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ స్టూడెంట్ అక్కడ దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఉన్నత చదువుల కోసం తెలుగు విద్యార్థి కిరణ్ రాపర్తు గతంలో యూఎస్‌కు వెళ్లాడు. అయితే.. జల్సాలకు అలవాటు పడిన ఆ స్టూడెంట్.. దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. 560 డాలర్ల విలువైన సన్‌గ్లాసెస్ దొంగలిస్తూ అతను దొరికిపోయాడని.. పోలీసులు కిరణ్‌కు బేడీలు వేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన టెక్సాస్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థుల వీసాలపై అనేక ఆంక్షలు విధిస్తున్న ఈ సమయంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల ప్రవర్తన గురించి ఆందోళన కలిగిస్తోంది.