Trum : ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర.. ఛేదించిన ఎఫ్‌బీఐ

Update: 2024-11-11 11:45 GMT

సంచలన విజయం సాధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నాలు, కుట్రలకు సంబంధించిన వివరాలను ఎఫ్బీఐ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ కుట్ర చేసిందని ఎఫ్‌బీఐ తెలిపింది. ఈ కుట్రను తాము భగ్నం చేసినట్టు ప్రకటించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌లోని ఒక అధికారి ఈ కుట్ర పన్నినట్లు గుర్తించింది. ట్రంప్‌పై నిఘా వేసి, అవకాశం దొరికనప్పుడు చంపేందుకు అతడు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆఫ్ఘన్ జాతీయుడిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తాజాగా వెల్లడించింది

Tags:    

Similar News