ఇరాన్ అధ్య క్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడంతో తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. వచ్చే నెల అంటే జూన్ 28న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
దేశంలో 14వ అధ్యక్ష ఎన్నికల తేదీని న్యాయ, కార్యనిర్వాహక, శాసనాధికారుల అధిపతుల సమావేశంలో ఖరారు చేశారు. అభ్యర్థుల నమోదు మే 30న ప్రారంభమవుతుందని, జూన్ 12 నుంచి 27 మధ్య ఎన్నికల ప్రచారాలు జరుగుతాయి. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. ఒకవేళ అధ్యక్షుడు మరణిస్తే 50 రోజుల్లో కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటి వరకూ ఉపాధ్యక్షుడే.. తాత్కాలిక అధ్యక్షుడి పాత్రను పోషిస్తారు.
రైసీ మృతి నేపథ్యంలో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొమమ్మద్ మొఖ్బర్ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆమోదం తర్వాత తాత్కాలికంగా దేశ ధ్యక్ష బాధ్యతలను మొఖ్బర్ కు అప్పగించారు.