Iran-Russia : రష్యాను ఆశ్రయించిన ఇరాన్

Update: 2025-06-23 09:15 GMT

రష్యాను ఆశ్రయించిన ఇరాన్ పై అమెరికా బాంబర్లతో దాడులు చేసిన నేపధ్యంలో ఇరాన్.. రష్యా మద్దతు కోరింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరపడానికి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘి మాస్కోకు వెళ్తారని పుతిన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. పుతిన్తో ఇరాన్ సంప్రదింపులు సోమవారం జరుగనున్నాయి. రష్యా ఇరాను స్నేహితుడు, మేము ఎల్లప్పుడూ ఒకరితో ఒకరం సంప్రదింపులు జరుపుతాం అని అరఫి మీడియాతో అన్నారు. కాగా, ఇరాన్పై అమెరికా దాడిని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్ చర్య బాధ్యతారాహిత్యమని, అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించిందని పేర్కొన్నది. మరోవైపు, రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కు అణ్వాయుధాలను సరఫరా చేసేందుకు అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడిం చారు. అయితే, వాటి పేర్లను మాత్రం వెల్లడించలేదు. మెద్వదేవ్ వ్యాఖ్య లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News