ఇజ్రాయెల్ లో కార్చిచ్చు చెలరే గింది. మూడు వేల ఎకరాల అడవి తగలబడి పోయింది. జెరూసలెం శివారులోని అడవుల్లో ఈ ప్రమాదం సంభవించింది. పొడి వాతా వరణం, గాలులు వీస్తుండటంతో మంటలు వేగంగా వాప్తి చెందుతున్నాయి. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. 24 గంటల్లో వేలాది మంది స్థానికులను అధికారు లు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దేశ చరి త్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా భా విస్తున్నారు. కార్చిచ్చు కారణంగా 13 మంది గాయపడ్డారు. అయితే ప్రాణనష్టం ఇంకా తెలియరాలేదు. జెరూసలెం నుంచి తెల్ అవీవ్ ప్రధాన రహదారి వరకు మంటలు వ్యాపించ టంతో ఆ దారులన్నీ అధికారులు మూసేశారు. అలాగే, వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ మంటలను ఆర్పేందుకు 160కి పైగా అగ్నిమాపక బృందాలు, డజన్ల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్లు, సైన్యం కూడా రంగంలోకి దిగాయి. ఇందుకు సంబం ధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ప్రమాదం కారణంగా మే 14న జెరూసలెంలో జరగాల్సిన స్వాతంత్య్ర దినోత్స వేడుకలను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది.