ఎన్ని యుద్ధాలు, ఉగ్ర దాడులు చేసినా భారత్ సింధూ జలాలను ఆపలేదని పాక్ ధీమా వ్యక్తంచేసింది. దీంతో తాజాగా పహల్గాం దాడికి పాల్పడింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం...పాక్ బలహీనత చూసి దెబ్బకొట్టింది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో వేయడంతో దేశవ్యాప్తంగా ఓ వర్గం పాక్ పాలకులపై గుర్రుగా ఉంది. దీనికితోడు బలోచిస్థాన్, ఖైబర్ ప్రావిన్స్‌లో వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. ఇదే సమయంలో భారత్ సింధు జలాల ఒప్పందంను పక్కనపెట్టినట్లు ప్రకటించింది. దీంతో సింధ్ రాష్ట్రంలో మరింత ఆందోళనలు మొదలయ్యాయి.