World's Richest Person : వరల్డ్ నెం. 1 కుబేరుడిగా జెఫ్ బెజోస్

Update: 2024-03-06 05:57 GMT

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి వరల్డ్ రిచెస్ట్ పర్సన్ హోదాని కోల్పోయారు. ఆయన స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచ నంబర్ 1 కుబేరుడిగా అవతరించారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. సోమవారం నాడు టెస్లా కంపెనీ షేర్ల విలువ ఏకంగా 7.2 శాతం క్షీణించింది. దీంతో మస్క్ సంపద విలువ 197.7 బిలియన్ డాలర్లకు తగ్గింది.

200.3 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ ప్లేస్ లోకి చేరాడు. గత 9 నెలల వ్యవ ధిలో ప్రపంచ సంపన్నుల జాబితాలో మస్క్ రెండో స్థానానికి పడి పోవడం ఇదే తొలిసారి. ఇక జెఫ్ బెజోస్ 2021 తర్వాత ప్రపంచ నంబర్ 1 స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. 2017లో ఆయన ఫస్ట్ టైమ్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను అధిగ మించి నంబర్ 1 స్థానంలో నిలిచారు.

Tags:    

Similar News