Black pink: బ్లాక్ పింక్ నుంచి లీసా అవుట్?

అపోహలతో భారీగా పడిపోయిన YG ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు;

Update: 2023-07-13 06:30 GMT

కొరియన్ గాయని లిసా(Lisa) కాంట్రాక్ట్‌ పునరుద్ధరణపై ప్రతిష్టంభన ఇంకా తొలగలేదు.. కానీ ఆ ఎఫెక్ట్ మాత్రం YG ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లపై మాత్రం బాగా పడింది. షేర్ల విలువ 7% పడిపోయింది. నిన్న మొన్నటి వరకు 73,900 కొరియన్ వోన్ వద్ద నున్న షేర్ ల విలువ ఇప్పుడు తాజాగా 66,700లకు పడిపోయింది.

మచ్చ లేని చందమామల్లా ఉండే ముఖాలు, ఆకర్షణీయమైన రిథమ్ రెండూ కలిసే కొరియన్ పాప్ మ్యూజిక్ ను టాప్ లో నిలబెట్టాయి. వాటిలో ఒకటి బీటీఎస్ బ్యాండ్. పాప్ మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కు ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు. ఈ సౌత్ కొరియ‌న్ బ్యాండ్‌కు ప్ర‌పంచం న‌లుమూల‌ల అభిమానులు ఉన్నారు. త‌మ మ్యూజిక్‌తో కోట్లాది మంది అభిమానుల హృద‌యాల్ని ప‌ర‌వ‌శింప‌జేస్తోంది ఏడుగురు సభ్యులు ఉన్న ఈ మ్యూజిక్ బ్యాండ్‌.


కొరియాలో ఇంకో పేరున్న బ్యాండ్ బ్లాక్ పింక్(Black Pink).. వీళ్లు దక్షిణ కొరియాలో అత్యధికంగా అనుసరించే నలుగురు లేడీ పాప్ స్టార్స్.. వాళ్ళే లిసా, జెన్నీ, జిసూ, ఇంకా రోస్. బ్లాక్‌పింక్ గ్రూపు నవంబర్ 2019లో స్పాటిఫై లో అత్యధికంగా అనుసరించే అమ్మాయిల సమూహంగా మారింది. ఇక సెప్టెంబర్ 2022 నాటికి, వారికి 31 మిలియన్లకు పైగా అనుచరులు ఉన్నారు. వీళ్ళకి ఒక్కోరికి బ్యాండ్ తో 7 సంవత్సరాల కాంట్రాక్టు ఉంటుంది. అయితే ఇప్పుడు గ్రూప్ సభ్యురాలు, థాయిలాండ్‌లో జన్మించిన లిసా కాంట్రాక్ట్‌ పునరుద్దరించడం జరుగుతుందో లేదో అన్న మాట బయటకు రావడం తో కే పాప్ ఏజెన్సీ వై జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు మే 11 నుంచి అత్యంత కష్ట స్థాయికి పడిపోయాయి.

ఈ టీమ్ కి వైజితో ఒప్పందం 2016లో మొదలైంది. కే పాప్ గ్రూపులో కాంట్రాక్ట్ సాధారణంగా ఏడేళ్లు మాత్రమే ఉంటుంది. దీంతో బ్లాక్ పింక్ ఒప్పందం ఆగస్టులో ముగియనుంది. మిగతా ముగ్గురితో ఒప్పందం విషయంలో పెద్దగా తేడాలు లేకపోయినప్పటికి లిసా కాంట్రాక్టు విషయంలో ఉన్న ప్రతిష్ఠంభన YG ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లపై పడింది.

Tags:    

Similar News