Kamala Harris : అమెరికా తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా హారీస్‌

Kamala Harris : అగ్రరాజ్యం చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలాహారీస్.

Update: 2021-11-20 01:30 GMT

Kamala Harris : అగ్రరాజ్యం చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలాహారీస్. అమెరికా తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా హారీస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమేరకు శ్వేతసౌధం వెల్లడించింది. ప్రెసిడెంట్ జో బైడెన్ వైద్య పరీక్షల నిమిత్తం అధ్యక్ష బాధ్యతలు కమలా హారీస్‌కు అప్పగించారు. పెద్ద పేగుకు సంబంధించి బైడెన్‌కు ప్రతి ఏటా కొలనోస్కోపీ పరీక్ష నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆయనకు మత్తుమందు ఇస్తారు. బైడెన్​అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కొలనోస్కోపీ చేయించుకోవడం ఇదే తొలిసారి. బైడెన్ నిర్ణయంతో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తొలి మహిళగా కమలా హారిస్‌ రికార్డు సృష్టించనున్నారు.

Tags:    

Similar News