డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షా అభ్యర్థిగా కమలా హ్యరిస్ కు మద్దతు పెరుగుతోంది. ఆమె ప్రచారానికి ఒక్కరోజులోనే రూ.677 కోట్ల విరాళం అందింది. పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా త్వరలో ఆమెను డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తారని అందరూ భావిస్తున్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ అనారోగ్య, వ్యక్తి గత కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కమలా హ్యారిస్ అధ్యక్ష పదవికి అర్హురాలని ఆయన తన మద్దతును తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రచారానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. గత 24 గంటల్లోనే ఆమెకు 81 మిలియన్ డాలర్లు (రూ. 677 కోట్లు) విరాళాలు అందినట్లు సమాచారం.