దక్షిణ కొరియా పాప్ సింగర్ వీసంగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. సియోల్‌లోని ఆయన నివాసంలో శవమై కనిపించినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ అతిగా తీసుకోవడమే కారణమని అనుమానిస్తున్నారు. కాగా గుండెపోటుతో మరణించినట్లు వీసంగ్ ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఇన్సోమ్నియా, హార్ట్‌సోర్ స్టోరీ వంటి హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. వీసంగ్ 2002లో 'లైక్ ఎ మూవీ' అనే R&B ఆల్బమ్ ద్వారా పరిచయం అయ్యాడు. R&B, పాప్, హిప్-హాప్ వంటి రకరకాల పాటలను మిక్స్ చేస్తూ సక్సెస్ సాధించాడు. అయితే, 2021లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పవర్ఫుల్ మత్తుమందు ప్రోపోఫోల్‌ను ఉపయోగించినందుకు శిక్షించబడినప్పుడు అతని కెరీర్ వెనక్కి తగ్గింది.