అమెరికా, ఆస్ట్రేలియాలకు పొంచి ఉన్న మరో ముప్పు..

అమెరికా ప్రజలను వణికిస్తున్నమరో పిడిగులాంటి వార్త ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

Update: 2020-09-11 06:41 GMT

అసలే కరోనాతో అతలాకుతలం అవుతోంది అగ్రరాజ్యం.. దానితోడు అడవులను దహిస్తున్న అగ్నికీలలు, వరదలతో ముంచెత్తుతున్న హరికేన్లు.. అమెరికా ప్రజలను వణికిస్తున్న తరుణంలో మరో పిడిగులాంటి వార్త ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. పర్యావరణంలో పెను మార్పులకు కారణమయ్యే లా నినా పసిఫిక్ మహా సముద్రంపై ఏర్పడిందని అమెరికా పర్యావరణ విభాగం స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు చల్లబడిపోవటాన్నే లా నినా అంటారు. దీని కారణంగా అమెరికా, ఆస్ట్రేలియాల్లో ప్రకృతి విపత్తులు తలెత్తుతాయి. కొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొరిబాడి అగ్రి ప్రమాదాలు సంభవిస్తాయి. లా నినా వల్ల అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫాన్లు ఏర్పడతాయి. కష్టాల్లో ఉన్న అమెరికా ప్రజలకు ఈ లా నినా వచ్చి పుండు మీద కారం చల్లినట్లు తయారైంది.. ఇప్పటికే మొదలైన లా నినా ప్రభావం నవంబర్, డిసెంబర్లలో కూడా వాతావరణాన్ని అగ్నిమయం చేయనుంది అని వెదర్ టైగర్ ఎల్ఎల్సీ అధ్యక్షుడు రేయాన్ ట్రచెలట్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News